పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోవాలి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బజ్జూరి వెంకట్ రెడ్డి
కూసుమంచి, అక్టోబర్ 30: కూసుమంచి మండలంలోని పట్టభద్రులందరు తప్పకుండా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూసుమంచి మండలం అధ్యక్షుడు బజ్జూరి వెంకట్ రెడ్డి(Mandal President Bajjuri Venkat Reddy) కోరారు. శుక్రవారం కూసుమంచి మండల కేంద్రంలో ఓటు హక్కు నమోదు పట్ల పట్టభద్రులకు అవగాహణ కల్పించారు.
ఓటు హక్కు నమోదు చేసుకొని వారి వివరాలు సేకరించి అక్కడే ఓటు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి ఆధ్వర్యంలో కూసుమంచి మండలం లో ఐదు ఓటర్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశామని, వాటికి ఇంచార్జ్ లను నియమించడం జరిగిందన్నారు. వారు ప్రతి గ్రామంలో తిరిగి ఓటు హక్కు నమోదు చేస్తారని,
మండల పరిధిలోని పట్టబద్రులు తమ ఓటు హక్కు కొరకు నవంబర్ 6 తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ యరబోలు సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, సర్పంచ్ కొండా కృష్ణవేణిమహిపాల్, ఓటర్ నమోదు ఇంచార్జ్ పెండ్ర అంజయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొండా శ్రీనివాస్ రావు తదితరులు హాజరైయ్యారు.