నాట్య ప్రదర్శనతో అబ్బురపరిచిన వేదం పాఠశాల విద్యార్థులు

18-10-2026 | 04:35pm

బోథ్ అక్టోబర్ 18 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని దుర్గా మండపం వద్ద ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది సైతం వేదం పాఠశాల విద్యార్థులు భరతనాట్యాన్ని ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు. దుర్గా మండపం వద్ద ప్రతి రోజు ఒక్క విధంగా కార్యక్రమాలను కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే రాత్రిపూట నిర్వహించిన భరతనాట్యం కార్యక్రమాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థుల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పచ్చిపాల సంతోష్ విద్యార్థులను అభినందించారు.

మరిన్ని వార్తలు