పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

18-10-2026 | 05:08pm

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే 

టేకులపల్లి, (విజయక్రాంతి): పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను(welfare schemes) అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. టేకులపల్లి మండలం(Tekulapalli Mandal) ముత్యాలంపాడు ఎక్స్‌రోడ్డు గ్రామ పంచాయతీ పరిధిలోని రైతు వేదికలో(Farmers' Platform) స్థానిక తహశీల్దార్ వీరభద్రం అధ్యక్షతన నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల(Kalyana Lakshmi, Shaadi Mubarak, and CMRF cheques) పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కుల పంపిణీ కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం అందిస్తున్న తరహాలో పథకాలు అమలు చేయడం లేదని విమర్శించారు. నీట్‌ పరీక్ష పత్రాల లీకేజీతో ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. దేశ యువత బీజేపీకి వ్యతిరేకంగా నిలిచి, రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడాలని ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బానోత్‌ రాంబాబు, టేకులపల్లి మండల కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు లక్కినేని శ్యాంబాబు, నాయకులు ఈది గణేష్‌, కాలే ప్రసాద్‌, రెడ్యా నాయక్‌, భుక్యా రవి నాయక్‌, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు