స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయండి
01-10-2026 | 05:32pm
బోథ్. అక్టోబర్ 1 (విజయక్రాంతి) మండలంలోని కౌట బి బస్టాండ్లో స్పీడ్ బ్రేకప్ ఏర్పాటు చేయాలని కోరుతూ వివేకానంద యూత్(Vivekananda Youth) సభ్యులు ఈ ఈ రమేష్ కు వినతిపత్రం ఇచ్చారు. తమ గ్రామం అంతరాష్ట్ర రహదారి పైన ఉన్నందున వాహనాలు వేగంగా వెళుతున్నాయని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున బస్టాండ్ లో ఇరువైపులా స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ఈ ఈత్వరలోనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.