డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకి న్యాయం జరగాలి
బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్.
బిజెపి జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే లో కలెక్టర్ కి వినతి పత్రం
లేని రిజర్వేషన్ ని కల్పిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా 12% ముస్లింలకి కేటాయించిన వాటిని రద్దు చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): గత బిఆర్ఎస్(BRS) ప్రభుత్వం 2023లో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ, పాత కొత్తగూడెంలో గల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల(Double bedroom houses)ను లాటరీ పద్ధతిలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించడం జరిగింది. ఆనాడు లాటరీ పద్ధతిలోనే వచ్చిన లబ్ధిదారులకు ముందుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలనీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు యువమోర్చా ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గతంలో మంజూరైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వకుండా మరల కొత్తగా లాటరీ తీయడం గతంలో ఇండ్లు వచ్చిన వారికి అన్యాయం చేయడమే అవుతుందన్నారు.
ఇందిరమ్మ ఇల్లు పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం(Prime Minister Housing Scheme) ద్వారా ఒక్కొక్క ఇంటికి సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయలు మంజూరు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే దీంతో పాటు హడ్కో ద్వారా నిధులు ఇప్పించిన విషయం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ముస్లింలకు కేటాయించిన 12% రిజర్వేషన్ రద్దు చేసి వాటిని నిరుపేదలైన బీసీలకు అర్హులైన పేద ప్రజలకి ఇవ్వవలసిందిగా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, బిజెపి పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు జుజూరు మోహన కృష, మువ్వ అపర్ణ, భూక్య ఆశ, భోగా లక్ష్మీ, సుజాతనగర్ మండల అధ్యక్షురాలు పద్మ తదితరులు పాల్గొన్నారు.