మర్కుక్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
28-09-2026 | 09:24pm
గజ్వేల్: వార్షిక తనిఖీల్లో భాగంగా మర్కుక్ పోలీస్ స్టేషన్(Markuk Police Station)ను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్(CP Rashmi Perumal) ఐపీఎస్ సోమవారం తనిఖీ చేశారు. స్టేషన్కు చేరుకున్న సీపీకి కేసులకు సంబంధించిన వాహనాలు, స్టేషన్ పరిసరాలను, రికార్డులు, వివిధ వర్టికల్స్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసులు క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ నిబద్ధతతో విధులు నిర్వహించాలని సీపీ సూచించారు. ప్రజల సమస్యలను ఓపికగా విని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ‘సిద్దిపేట సురక్ష నేత్ర’లో భాగంగా గ్రామాల్లో సీసీ కెమెరాల నిఘాను పెంచాలని సూచించారు. ‘సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర’ కార్యక్రమంపై గ్రామీణ యువతకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏసీపి నరసింహులు, రూరల్ సీఐ రవి రాజు, ఎస్ఐ యూనుస్ అహ్మద్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు.