సింగరేణికి రూ.59 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి

10-10-2026 | 04:19pm

ఇల్లెందు టౌన్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో(Telangana Genco, Transco) నుంచి సింగరేణికి రావాల్సిన రూ.59 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు(AITUC leaders) డిమాండ్ చేశారు. బకాయిల సాధన కోసం అక్టోబర్ 13న హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ(Vidyut Soudha) ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దాసరి రాజారామ్ అధ్యక్షతన జరిగిన యూనియన్ సమావేశంలో కె. సారయ్య, ఎండీ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ బకాయిలు అందకపోతే కార్మికుల లాభాల వాటా, దీపావళి బోనస్ చెల్లింపులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు