ఆర్చరీ విద్యార్థులకు అభినందనలు

11-10-2026 | 07:01pm

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్

భద్రాచలంటౌన్, (విజయక్రాంతి): ఆర్చరీ ప్రీమియర్ లీగ్(Archery Premier League) అనుమతి మేరకు గిరిజన సంక్షేమ శాఖ(Tribal Welfare Department) క్రీడా పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థులను ఆర్చరీ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనడానికి 86 మందిని హైదరాబాద్కు పంపించడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు. కాచనపల్లి క్రీడా పాఠశాల నుండి 43 మంది బాలికలు, కిన్నెరసాని క్రీడా పాఠశాల నుండి 43 మంది బాలురు  పిడి, పి ఈ టి , ఏఎస్ఓ సమక్షంలో హైదరాబాదుకు తరలినట్లు తెలిపారు.

విలువిద్య ప్రీమియర్ లీగ్ క్రీడలలో పాల్గొనే బాలబాలికలకు భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ విలువిద్య క్రీడాకారులను ప్రత్యక్షంగా చూసేందుకు మన గిరిజన విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని విలువిద్యలో రాణించేందుకు వారికి ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. క్రీడా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ప్రీమియర్ లీగ్ లో పాల్గొనడానికి అనుమతి మంజూరు చేసి బస్సు సౌకర్యం కల్పించినందుకు ఐటిడిఏ పిఓ బి రాహుల్ ,డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని చందనకు విద్యార్థినీ విద్యార్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

విలువిద్యను ప్రోత్సహించడంలో,గిరిజన యువ క్రీడా ప్రతిభను పోషించడంలో తమ అమూల్యమైన మద్దతు, సహకారం అందించినందుకు ఏపీఎల్ చైర్మన్ ఏపీఎల్ బృందం , యునైటెడ్ ఖమ్మం జిల్లా విలువిద్య సంఘం వారికి క్రీడా అధికారి గోపాలరావు ఏఎస్ఓ వెంకటనారాయణ సోయం నాగేశ్వరరావు రాంబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు