"చిన్న తిరుపతి" నిర్మాణానికి సర్వం సిద్దం

11-10-2026 | 08:05pm
  1. ఖమ్మం లో ఆధ్యాత్మిక శోభ
  2. నేడు అల్లిపురం వద్ద శ్రీవెంకటేశ్వర స్వామి దివ్యఆలయం నిర్మాణానికి భూమి పూజ
  3. శిలన్యాసం పూజలో పాల్గొన్న మంత్రి తుమ్మల, కుమారుడు యుగేందర్
  4. భూమి పూజకు భారీగా ఏర్పాట్లు
  5. 2లక్షల మంది భక్తజనం నడుమ భూమిపూజ
  6. దగ్గరుండి పనులు పర్యవేక్షణ చేస్తున్న మంత్రి తుమ్మల

ఖమ్మం, అక్టోబర్ 11(విజయక్రాంతి) : ఖమ్మం లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది.. చిన్న తిరుపతి(Chinna Tirupati) కి రంగం సిద్దమైంది.. ఖమ్మం నగరంలోని  అల్లిపురం-కొత్తగూడెం వద్ద తిరుమల తిరుపతి దేవాలయంను(Tirumala Tirupati Devasthanam) పోలి ఉండే మహా దివ్య ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం(Sri Venkateswara Swamy Temple) ను నిర్మాణం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.. కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్న ఈ ఆలయానికి సోమవారం మంత్రుల సమక్షంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి(Sri Sri Sri Tridandi Srimannarayana Chinna Jeeyar Swamy) చేతుల మీదుగా భూమి పూజ చేయనున్నారు.

అందుకు గాను అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.  పూర్తి వివరాల్లోకి వెళ్తే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంను నిర్మాణం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శంకుస్థాపన మహోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేశారు.

యాగశాల, దేవాలయం నిర్మాణం కు కావాల్సిన భూమి పూజా స్థలాన్ని నిర్మాణం చేశారు. ఈ మహోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు, శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు హాజరవుతున్నారు. 

తిరుపతిని పోలి ఉండే దేవాలయం..

తిరుమల తిరుపతి దేవాలయంను పోలి ఉండే విధంగా ఆలయం నిర్మాణాలు, గోపురం, భారీ కేడ్లు, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక గదులు, మరుగుదోడ్లు, మంచి నీటి సౌకర్యం, స్నానాల కేంద్రాలు, కొలనులు, ప్రత్యేకమైన దేవాలయాలను నిర్మాణం చేస్తున్నారు. ప్రతి రోజు అన్నదానం చేసేందుకు ప్రత్యేక సత్రాలు, సేద తీరడానికి ప్రత్యేక విశ్రాంతి గదులను నిర్మాణం చేస్తున్నారు. వాహనాలకు పార్కింగ్ స్థలాలను  ఏర్పాటు చేస్తున్నారు.

లక్షలాది మంది హాజరు..

ఆలయ నిర్మాణానికి సోమవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ఈ మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు గాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.. జిల్లా వ్యాప్తంగా ఆహ్వానాలను అందజేశారు. ఖమ్మం నగరంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. భారీగా తరలిరావాలని కోరుతున్నారు. సుమారు 5లక్షలందిని ఆహ్వానించగా, 2లక్షల మంది హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు . 

భారీ ఏర్పాట్లు.. వాహనాల రాకపోకలకు రూట్ మ్యాప్

భూమి పూజ మహోత్సవంకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అందుకు తగ్గట్లుగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా రూట్ మ్యాప్ విడుదల చేశారు. మంత్రి తనయుడు తుమ్మల యుగేందర్ దగ్గరుండి భారీగా ఏర్పాట్లు చేస్తున్నాడు. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు..

ప్రతి భక్తుడికి నవధాన్యాలు, లడ్డూ ప్రసాదం పంపిణి

భూమి పూజ కార్యక్రమానికి వచ్చే ప్రతి భక్తుడికి టీటీడీ ప్రసాదాలను ఏర్పాటు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక లడ్డూ, నవధాన్యాలు, ప్రసాదాలను అందజేస్తున్నారు. వారికి అందజేసేందుకు 2500మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. మొత్తానికి ఈ దేవాలయం నిర్మాణంతో ఖమ్మం లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని, శ్రీవారిని కొలిచేందుకు తిరుపతి వెళ్ళాల్సిన అవసరం ఉండబోదని భక్తులు చెబుతున్నారు. 

ప్రారంభమైన భూమి పూజ..పాల్గొన్న మంత్రి తుమ్మల, కలెక్టర్ 

టీటీడీ ఆధ్వర్యంలో నిర్మాణం చేస్తున్న శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం భూమి పూజా కార్యక్రమాలు ఆదివారం అంగరంగవైభవంగా, భక్తోత్సవంతో ప్రారంభమైయ్యాయి. పదుల సంఖ్యలో అర్చకులు, వేదపండితులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తుమ్మల యుగేందర్, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, గిడ్డంగుల శాఖ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర్ హాజరైయ్యారు. వేదమంత్రోత్సవం నడుమ భూమి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

మరిన్ని వార్తలు