దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
11-10-2026 | 07:03pm
దమ్మపేట, అక్టోబర్ 11(విజయక్రాంతి): మండల కేంద్రంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఆదివారం దేవీ నవరాత్రుల ఉత్సవాలు(Devi Navaratri Celebrations) ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ(Bala Tripura Sundari) దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, అనంతరం ప్రసాద వినియోగం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ బొమ్మ సెంటర్ నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు దారా ప్రసాద్, పసుమర్తి సత్యనారాయణ, సాయిరాం, సాయి, నాగ రాంబాబు, మల్లికార్జునరావు, యార్లగడ్డ ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.