సీతారామ ప్రాజెక్టు పనులను అడ్డుకున్న నిర్వాసితులు
దమ్మపేట, అక్టోబర్ 11(విజయక్రాంతి): మండల పరిధిలోని జగ్గారం సీతారామ ప్రాజెక్టు(Sitarama Project) పనులను రాత్రి వేళల్లో రైతులకి తెలియకుండా పనులు నిర్వహిస్తున్న జేసీబీ లను నిర్వాసితులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో నిర్వాసితులు(Displaced persons) మాట్లాడుతూ మాకు పూర్తి నష్ట పరిహారం ఇవ్వాలని, గ్రామ పంచాయతీ(Gram Panchayat) లో సమావేశం ఏర్పాటు చేసి నిర్వాసితుల కి సమాధానం చెప్పిన తర్వాతే పనులు మొదలు పెట్టాలని, అప్పటి వరకు పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు.
కనీసం భూములకు సరిహద్దులు నిర్ణయించలేదని, అధికారులు మా న్యాయమైన సమస్యని పరిష్కరించాలని కోరారు. ఆదివాసి సంఘాలు(Tribal associations), ఆదివాసి పెద్దలు మా నిర్వాసితులకు అండగా నిలబడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీతారామ ప్రాజెక్టు నిర్వాసితులు కుర్సం చిన్నరాజు, వగ్గెల బాలకృష్ణ, దాసు, సీత, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.