హౌసింగ్ బోర్డు నుండి లైబ్రరీ వరకు రోడ్డు నిర్మాణం
కాంగ్రెస్ పార్టీ నాయకుల సమష్టి కృషి
మున్సిపల్ మాజి వైస్ చైర్మన్ చీర్ల రమేష్
మేడ్చల్ అర్బన్ అక్టోబర్ 11(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Cyberabad Municipal Corporation) మేడ్చల్ సర్కిల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు నుండి లైబ్రరీ వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల(Congress party leaders) సమష్టి కృషితో సీసీ రోడ్డు నిర్మాణ పనులను(CC road construction work) ప్రారంభించడం జరిగిందని మేడ్చల్ మున్సిపల్ మాజి వైస్ చైర్మన్ చీర్ల రమేష్(Cheerla Ramesh) పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు నుండి లైబ్రరీ వరకు రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం కావడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
పట్టణ ప్రజల రాకపోకలకు ఎంతో ఉపయోగకరమైన ఈ రహదారి నిర్మాణం కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్థానికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్,మేడ్చల్ మాజి ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి,జాతీయ కాంగ్రెస్ అధికార పార్టీ ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్,మేడ్చల్ మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహాకారంతో ప్రత్యేక చొరవ నిరంతర కృషి అభివృద్ది కార్యమానికి దోహద పడ్డాయని మాజి వైఎస్ చైర్మన్ చీర్ల రమేష్ వెల్లడించారు.
ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజల సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న సిహెచ్ రమేష్ మరోసారి ప్రజా సేవా పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు.గతంలో హౌసింగ్ బోర్డు నుండి లైబ్రరీ వరకు సిసి రోడ్డు,వీధి దీపాల కోసం నిధులు మంజూరు చేయాలని కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్,సిఎంసి కమిషనర్ లను కలిసి వినతి పత్రాలను అందజేయడం జరిగిందని మాజి వైఎస్ చైర్మన్ చీర్ల రమేష్ చెప్పారు.నిధులు మంజూరు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.