జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

11-10-2026 | 06:58pm

ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కల్వకుర్తి అక్టోబర్ 11 : నిరుద్యోగ యువతకు(Unemployed youth) ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఐక్యత ఫౌండేషన్(Aikyata Foundation) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 25వ జాబ్ మేళాను(Job Fair) సద్వినియోగం చేసుకోవాలని టాస్క్ సీఓఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్పెషల్ జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ నిరుద్యోగులతో పాటు ఇతర ప్రాంతాల వారికి కూడా ఇందులో అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు వివిధ విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ఇందులో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

అభ్యర్థులు తమ ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో ఈ నెల 13న ఆమనగల్‌లోని ఐక్యత ఫౌండేషన్ కార్యాలయంలో జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఐక్యత ఫౌండేషన్ ద్వారా ఉపాధి, విద్య, వైద్య సేవలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి శుద్ధి కోసం స్వచ్ఛ జలధార కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే తలకొండపల్లి మండలంలో 126, వెల్దండ మండలంలో 136 తాగునీటి ట్యాంకులను జర్మనీ సాంకేతికతతో శుభ్రం చేశామని వెల్లడించారు. ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు