శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు

11-10-2026 | 06:55pm

మఠంపల్లి అక్టోబర్ 11(విజయక్రాంతి) : మఠంపల్లి మండలంలోని మట్టపల్లి మహక్షేత్రములో శ్రీ రాజ్యలక్ష్మి(Sri Rajyalakshmi) ,చెంచులక్ష్మీ( Chenchulakshmi),భక్త ప్రహ్లాద సహిత యోగానంద లక్ష్మీనరసింహ స్వామి(Lord Lakshmi Narasimha Swamy) వారికి త్రయాహ్నిక దీక్షగా వైఖానస శాస్త్రానుసారంగా పవిత్రోత్సవములు తేది:08-10-2026 నుండి 11-10-2026 వరకు అత్యంత వైభవముగా నిర్వహించారు. ఆదివారం ఉదయం 8-00 గంటలకు అగ్ని ఆరాధనలు. పూర్ణాహుతి, వవిత్రవిసర్జనోత్సవము, సప్తదశకుంభారోపణం,శాంతి కళ్యాణ మహోూత్సవము, ఆచార్య సన్మానం కార్యక్రమములు జరిగాయి.

యాజ్ఞిక నిర్వాహణ ఆగమ ప్రవర బొర్రా వాసు దేవాచార్యులు, ముత్తారంగ్రామం ఖమ్మం జిల్లా వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు,విజయ్ కుమార్, కార్యనిర్వహణాధికారి తుమ్మల వెంకటచలపతి,సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు,తూమాటి శ్రీనివాసాచార్యులు, కృష్ణమాచార్యులు,రామాచార్యులు, బ్రహ్మాచార్యులు,ఫణిభూషన మంగాచార్యులు,పద్మనాభా చార్యులు, బదరీనారాయాణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి,ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు