వర్షాల కోసం ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు
ఘట్ కేసర్, అక్టోబర్ 11 (విజయక్రాంతి) : వర్షాలు(Rains) కురవాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులు(Muslim brothers) ఆదివారం ఘట్ కేసర్ చిన్న చెరువు వద్ద ప్రత్యేక ప్రార్థనలు(Special prayers) నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు(Tanks and ponds) నీటితో నిండాలని, రైతులకు మేలు జరగాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ప్రకృతి కరుణించి సమయానికి వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని అల్లాహ్‌ను వేడుకుంటూ ప్రార్థనలు చేశారు.
ఘట్కేసర్ జామా మస్జిద్ కమిటీ, బాలాజీనగర్ లోని మహమ్మదీయా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రార్థన నమాజును అనగా (సలాతుల్ ఇస్తిస్కా) ఘట్కేసర్ లోని చిన్న చెరువు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలంలో నమాజు చేసి ఆ అల్లాహ ను వేడుకోవడం జరిగింది.ఈకార్యక్రమంలో జామ మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ అజీజ్, ప్రధాన కార్యదర్శి కుతుబుద్దిన్, మహమ్మదియా మస్జిద్ అధ్యక్షులు శాశాభాయ్, ప్రధాన కార్యదర్శి తాహెర్ అలీ, మజీద్ ఇమాములు, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.