భక్తులకు అన్నప్రసాద వితరణ

20-09-2026 | 04:14pm

టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం కేంద్రంలోని కుప్పుస్వామికాలనీలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని(Food distribution program) భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని నందిని నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించారు.పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గణపతి నవరాత్రుల సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం అందించడం పట్ల నిర్వాహకులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు