కుట్టు మిషన్ల శిక్షణ ధ్రువపత్రాల పంపిణీ
మేయర్ మూడ్ గణేష్
కొత్తగూడెం,(విజయక్రాంతి): రామవరం లోని 16వ డివిజన్ పరిధిలో మదర్ తెరిసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో, 45 రోజుల శిక్షణ శిబిరం(sewing machine training)లో శిక్షణ పొందిన 40 మహిళలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ శిక్షణ పత్రాలను పంపిణీ చేశారు. సోమవారం అంబేద్కర్ చమున్లో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ల పంపిణీలో 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ(Corporator Munigadapa Padma) అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ గణేష్ మాట్లాడుతూ, మహిళలు స్వశక్తితో ఎదగడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ప్రతి మహిళ తన కాళ్లపై తన నిలబడి సమాజంలో ఒక గౌరవాన్ని పొందాలని సూచించారు
కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) సహకారంతో, ప్రతి పనిని అందుబాటులోకి తీసుకురాడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తామన్నారు. అనంతరం కార్పొరేటర్ మునిగడప పద్మ మాట్లాడుతూ,మహిళల స్వయం ఉపాధి కోసం పాటుపడుతున్న మదర్ తెరిసా ఫౌండేషన్ స్టేట్ కోఆర్డినేటర్ సంధ్యా రెడ్డికి సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మహిళలంతా క్రమశిక్షణతో శిక్షణ పొంది వృత్తిలో రాణించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టైలరింగ్ శిక్షణ ఇచ్చిన టీచర్ కవిత,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, న్యాయవాది మునిగడప వెంకటేశ్వర్లు, శిక్షణకు వసతి గృహాన్ని అందించిన దండే భాగ్యలక్ష్మి శిక్షణ పొందిన 40 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.