తెలంగాణలో కొత్త పెన్షన్లకు నేటితో గడువు
15-09-2026 | 09:29am
తెలంగాణలో కొత్త పెన్షన్ల(New pensions) కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే గడువు నేటితో (సెప్టెంబర్ 15) ముగియనుంది. అర్హులైన నిరుపేదలు ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే ఇవాళ్టిలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 4.8 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 25 నాటికి దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అర్హతలను పరిశీలించనున్నారు. పరిశీలన అనంతరం అక్టోబర్ 1 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.