పరేడ్ గ్రౌండ్‌కు కిషన్‌రెడ్డి
15-09-2026 | 08:50am
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈ నెల 17న నిర్వహించనున్న కార్యక్రమాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు ఉదయం 9 గంటలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లనున్నారు.
పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న సైనిక దళాల రిహార్సల్స్(Rehearsals)ను కిషన్‌రెడ్డి పరిశీలించనున్నారు. విమోచన దినోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ఇతర నిర్వహణ అంశాలపై అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది.