లింగంపల్లి గురుకుల భవన నిర్మాణానికి భూమి పూజ
15-09-2026 | 04:50pm
మునిపల్లి,(విజయక్రాంతి): మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల నిర్మాణానికి సీఎస్ఆర్ నిధులతో తొషిబా కంపెనీ యజామాన్యం రూ. 10కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం భూమి పూజ చేసి పనులను ప్రజాప్రతినిధులు, కంపెనీ ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... లింగంపల్లి గురుకుల పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో గత ఏడాది కూలి పోయిందని, అందుకు తమవంతుగా భవన నిర్మాణం కోసం రూ.10కోట్లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోషిబా కంపెనీ జీఎం రామకృష్ణ, మాజీ జడ్పీటీసీ అసద్ పటేల్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, రాయికోడ్ ఏఎంసీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, మండల నాయకులు మసూద్ పటేల్, నాగేష్, తోషిబా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.