సెప్టెంబర్ 17 పాదయాత్రను విజయవంతం చేయాలి

15-09-2026 | 04:15pm

* డాక్టర్ కల్నల్ మాచెర్ల బిక్షపతి ముదిరాజ్

చేర్యాల, సెప్టెంబర్ 15: బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ముందుకు సాగుతోందని జనగామ జిల్లా ఇన్‌ఛార్జ్ డాక్టర్ కల్నల్ మాచెర్ల బిక్షపతి ముదిరాజ్ అన్నారు.సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బెజ్జరబోయిన వెంకట్ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్పీ నూతన కార్యాలయాన్ని బిక్షపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్న నాయకత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తున్నామని తెలిపారు. తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి అయ్యే వరకు కార్యకర్తలు అలుపెరగకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బానిసత్వాన్ని వీడి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలంతా తమ భవిష్యత్తు కోసం టీఆర్పీలో చేరాలని కోరారు.ఈ నెల 17న ప్రారంభం కానున్న రాష్ట్రవ్యాప్త పాదయాత్రను విజయవంతం చేసి హైదరాబాద్ పాలకుల్లో గుబులు పుట్టించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.కార్యక్రమంలో విద్యా విభాగం రాష్ట్ర అధ్యక్షులు పిట్టల సురేష్ ముదిరాజ్, జనగామ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తుప్పతి బిక్షపతి కురుమ, మహిళా అధ్యక్షురాలు తుప్పతి శ్వేత కురుమ, చేర్యాల మండల అధ్యక్షుడు జీడాల సాయి కిరణ్ ముదిరాజ్, మద్దూర్ మండల అధ్యక్షులు ఏలూరి సురేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు