గోల్డ్ రేట్స్కు బ్రేక్.. ఎంతంటే..?
15-09-2026 | 11:28am
హైదరాబాద్, సెప్టెంబర్ 15.(విజయక్రాంతి):హైదరాబాద్ బులియన్ మార్కెట్లో(Hyderabad bullion market) బంగారం ధరలు ఇవాళ కూడా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.920 తగ్గి రూ.1,53,170కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.850 తగ్గి రూ.1,40,400గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో స్థానిక మార్కెట్ పరిస్థితులను బట్టి బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. కొనుగోలు సమయంలో 3 శాతం జీఎస్టీ అదనంగా వర్తిస్తుంది. ఆభరణాల కొనుగోలులో మేకింగ్ ఛార్జీలు కూడా ధరపై ప్రభావం చూపుతాయి.