మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుండెపోటుతో కన్నుమూత

15-09-2026 | 02:49pm

ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(Alla Nani) మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఏలూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, వైసీపీ హయాంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా సేవలు అందించారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీని వీడిన ఆయన టీడీపీలో చేరారు. ఆళ్ల నాని పూర్తి పేరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్. ఆయన ఆకస్మిక మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు