రెండో టీ20లో భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ ఢీ

15-09-2026 | 09:48am

భారత్‌, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య రెండో టీ20(T20) మ్యాచ్‌ నేడు ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్‌ మరో గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌ సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కాకుండా ఫ్యాన్‌కోడ్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. టీవీలో సోనీ స్పోర్ట్స్‌ టెన్‌ 5 హెచ్‌డీ, ఎస్‌డీ ఛానళ్లలో మ్యాచ్‌ను వీక్షించవచ్చు.

మరిన్ని వార్తలు