టీపీసీసీ సోషల్ మీడియా సెక్రటరీగా అరెల్లి కిరణ్ గౌడ్

15-09-2026 | 02:37pm

బాధ్యతలు స్వీకరించిన కిరణ్ గౌడ్‌

మంథని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల శుభాకాంక్షలు

మంథని, సెప్టెంబర్ 14(విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(Congress Committee) టిపిసిసి (TPCC)) సోషల్ మీడియా విభాగంలో స్టేట్ సోషల్ మీడియా సెక్రటరీగా మంథని మండలం లోని సూరయ్యపల్లి గ్రామానికి చెందిన అరెల్లి కిరణ్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబుల ఆశీస్సులు, ప్రోత్సాహంతో పార్టీ సోషల్ మీడియా విభాగంలో కీలక బాధ్యతలు కిరణ్ చేపట్టడం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

పార్టీ విధానాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కిరణ్ గౌడ్ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన  కిరణ్ గౌడ్‌కు పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు