అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎం ఎల్ ఏ మెచ్చా
దమ్మపేట, అక్టోబర్ 18(విజయక్రాంతి): దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో(Devi Sharan Navaratri Festival) భాగంగా దమ్మపేట మండల కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలను అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎం ఎల్ ఏ, బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు(Mecha Nageswara Rao) సందర్శించారు. దారా మల్లికార్జున రావు కాంప్లెక్స్, గాంధీ బొమ్మ సెంటర్, బంజారా కాలనీల్లో ఏర్పాటు చేసిన మండపాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దారా మల్లికార్జున రావు కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమాన్ని మెచ్చా నాగేశ్వరరావు ప్రారంభించారు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం ఆయా మండపాల కమిటీ సభ్యులు మెచ్చా ను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున రావు, మాజీ ఉప సర్పంచ్ దారా యుగంధర్ ,వార్డ్ మెంబర్ లు దారా రాము, రూపా రాంబాబు, అబ్దుల్ జిన్నా, గాజుబోయిన యేసు, యార్లగడ్డ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.