సాగునీరు లేక ఎండుతున్న వరి పంటలు
భీమా కాల్వలకు నీరు విడుదల చేయాలి
బీజేపీ కొల్లాపూర్ అసెంబ్లీ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్రావు డిమాండ్
వీపనగండ్ల, అక్టోబర్ 18 (విజయక్రాంతి): సాగునీరు(Irrigation water) అందక భీమా కాల్వల(Insurance canals) పరిధిలో వరి పంటలు(Paddy crops) ఎండిపోతుండటంతో రైతులు(Farmers) తీవ్ర ఆందోళన చెందుతున్నారని బీజేపీ కొల్లాపూర్ అసెంబ్లీ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్రావు(Elleni Sudhakar Rao) అన్నారు. రైతన్నకు భరోసా కార్యక్రమంలో భాగంగా రెండో రోజు మండల పరిధిలోని వీపనగండ్ల, సంగినేనిపల్లి, కల్వరాల గ్రామాల్లో పర్యటించి ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీరు అందక కళ్ల ముందే పంటలు ఎండిపోతుంటే రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భీమా, జూరాల కాల్వల ద్వారా సాగునీరు అందకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతుల సమస…