ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి,అక్టోబర్ 18: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. ఆదివారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో గల 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను(medical services), రోగుల పరిస్థితి, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనిన్నారు.
రోగులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వ్యాధుల వివరాలు తెలుసుకుని వైద్యులకు ఆయన పలు సూచనలు చేశారు. వార్డులను స్వయంగా పరిశీలించి, రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పండుగల వేళలలో కూడా ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు వైద్యులు తప్పనిసరిగా విధులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర వైద్య సేవల కోసం ఎమర్జెన్సీ వార్డు నిరంతరం తెరిచి ఉంచాలని, కనీసం ఒక మెడికల్ డాక్టర్ విధిగా అందుబాటులో ఉండాలని తెలిపారు. ఆయన వెంట సంబంధిత విద్యాధికారులు,సిబ్బంది ఉన్నారు.