గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యం..

18-10-2026 | 07:43pm

ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి..

రాజాపూర్ అక్టోబర్ 18: పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy) అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గుండ్ల పొట్లపల్లి గ్రామంలో రూ. 12 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనాన్ని,రూ. 35 లక్షల నిధులతో నిర్మించిన అండర్ డ్రైనేజ్ సిసి రోడ్లను ప్రారంభించారు. అలాగే రూ. 10 లక్షల నిధులతో నిర్మిస్తున్న మహిళా సమైక్య భావన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం తాగిన నిధులు అందించి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇప్పటికే జడ్చర్ల నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నవోదయ పాఠశాల ఏటిసి సెంటర్లను తీసుకొచ్చానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాసయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్, మాజీ ఎంపిటిసి సునీత శ్రీనివాస్ నాయక్, సత్యం, శివకుమార్,శంకరయ్య, రాజశేఖర్ రెడ్డి, రాజు నాయక్,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు