అంకుసాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

18-10-2026 | 07:54pm

డీజే సౌండ్స్‌తో.. దాండియా ఆటలతో మహిళల సందడి

తంగళ్ళపల్లి, అక్టోబర్ 18 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. డీజే సౌండ్స్‌తో పాటు దాండియా ఆటలతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. పాటలు, ఆటలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

మరిన్ని వార్తలు