సద్దుల బతుకమ్మ సంబరాలు

18-10-2026 | 07:41pm

కొండపాక, అక్టోబర్ 18: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే ఈ పథకం పండుగ, ప్రకృతిని పూజిస్తూ పువ్వులను కొలుస్తూ తొమ్మిది రోజులు 9 పేర్లతో ఆడపడుచులు ఆనంద ఉత్సవాలతో బతుకమ్మ పండుగ(Bathukamma Festival) జరుపుకుంటారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ఐక్యతకు ప్రత్యేకగా అందరూ కలిసిమెలసి ఆడపడుచులు బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. కొండపాక, కుకునూరు పల్లి మండల వ్యాప్తంగా ఆదివారం సద్దుల బతుకమ్మను ఆడపడుచులు అందరూ రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఒక చోట చేర్చి దేవాలయాల ప్రాంగణాలలో బతుకమ్మ పాటలు పాడుతూ ఘనంగా నిర్వహించారు.

మరిన్ని వార్తలు