చంద్రబాబు జోలికి వస్తే ఖబర్దార్ హరీష్ రావు

18-10-2026 | 07:44pm

బోధన్, అక్టోబర్ 18 (విజయ క్రాంతి) : బోధన్ తెలుగు యువత ఇంచార్జ్ ఏత్తోండ రాజేందర్(Etthonda Rajender) ఆదివారం ఈరోజు మాట్లాడుతూ... పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్(Polavaram-Banakacharla Link Project) పేరుతో గోదావరి జలాలను(Godavari waters) ఆంధ్రాకు తరలించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అనడాన్ని తెలుగు దేశం పార్టీ తరపున ఖండిస్తున్న పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) కట్టేది గోదావరి జలాలు తెలంగాణ దాటి ఆంధ్రాలోకి వెళ్లిన తర్వాత అలాంటప్పుడు సముద్రం లోకి వృథాగా పోయే నీళ్లను చంద్రబాబు(Chandrababu) ఒడిసిపట్టి ప్రజాక్షేమానికి వాడటం తప్పు ఎలా అవుతుందో, ఒంటి మీద కిరోసిన్ పోసుకుని అగ్గిపెట్టె కొరకు వెతుకున్న హరీష్  రావు చెప్పాలి.

చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంపద సృష్టించిన మా నాయకుడి పైన మరొకసారి మాట్లాడితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాయకులు హరీష్ రావు ఇంటి ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాను అని ఏత్తోండ రాజేందర్ అన్నారు సంపద కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ కుటుంబం మొత్తం దోచుకొని 

తిన్న విషయం తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు గోదావరి నీళ్లను తెలంగాణలో నిల్వ చేసే పరిస్తితి లేదు. దీనికిగాను సిగ్గు పడాల్సిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రాంతీయ భావోద్వేగాలు రెచ్చగొట్టడాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్రంలో ఉన్న ఎలినినో పరిస్థితులను దాని ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు సహాయం చేయకుండా చంద్రబాబు నాయుడు పైన  తప్పుడు ఆరోపణలను మానుకోవాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులను మరియు హరీష్ రావు హెచ్చరిస్తున్నాను.

మరిన్ని వార్తలు