తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలి

30-10-2026 | 06:31pm

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని గడుగులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం నందు కేత్ బచావో అభయన్ కార్యక్రమంలో భాగంగా గండుగులపల్లి గ్రామ రైతులతో మండల వ్యవసాయ అధికారి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎ ఓ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే రబీ సీజన్లో ఎల్ నినో ప్రభావం వలన వచ్చే మార్చి వరకు వర్షపాతం నమోదయ్యే పరిస్థితి లేదని, రైతులు తక్కువనేటితో పండే పంటలైన అపరాలు, కూరగాయల పంటలను సాగు సూచించారు.

వరి, మొక్కజొన్న పంట సాగును ఈ రబీ సీజన్లో వాయిదా వేయాలని తెలిపారు. గండుగులపల్లి విద్యుత్ శాఖ ఏ మాట్లాడుతూ కరెంటు ఉత్పత్తి పూర్తిస్థాయిలో పడిపోయే అవకాశం వుందని, రైతులు అప్రమత్తంగా ఉండి తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి వినోద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు