విశ్వకర్మలకు సామాజిక న్యాయం కల్పించాలి
ముకరంపుర,(విజయక్రాంతి): విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులకు సామాజిక న్యాయం కల్పించాలని, వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్, ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం(Vishwabrahmin Vishwakarma Sangham) నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పాములపర్తి వేణుగోపాల చారి అధ్యక్షతన శుక్రవారం కరీంనగర్లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోజు భిక్షపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విశ్వకర్మ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, సామాజిక అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేసి కార్పొరేషన్ మరియు ఫెడరేషన్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం చే ఇండస్ట్రియల్ లోన్లు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పాలికోజు నరసింహ చారి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నాంపల్లి సోమచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రోజు రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు కాసిపేట మురళి, నాగుర్ల మురళి, జిల్లా ఉపాధ్యక్షులు చాన గుండ నరేష్, తదితరులు పాల్గొన్నారు.