జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

18-10-2026 | 09:21pm

- గ్రామ గ్రామాన బతుకమ్మ ఆడిన మహిళలు 

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం మహిళలు ఘనంగా సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) వేడుకలను జరుపుకున్నారు. రంగురంగుల పూలతో ఏర్పాటు చేసిన బతుకమ్మలను జిల్లా కేంద్రంతో పాటు గ్రామ గ్రామాన ప్రధాన కూడలిలలో ఏర్పాటు చేసి బతుకమ్మ పాటలను పాడుతూ మహిళలు అలరించారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ వేడుకలలో భాగంగా చివరి రోజున పెద్ద బతుకమ్మ పండుగ  ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు రకరకాల పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మలను అలంకరించారు, రంగురంగుల పూవులతో బతుకమ్మలను పోటాపోటీగా అలంకరించారు. ఎంతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పేర్చి గ్రామాల్లోని కూడలిలో బతుకమ్మలను ఉంచి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. అనంతరం బతకమ్మలను తీసుకొని వెళ్లి సమీపలోని వాగులో, చెరువులలో, కాలువలలో, ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన నీటి గుంతలు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి తమ వెంట తీసుకువెళ్లిన సద్దులను ఒకరికొకరు పంచి పెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు