ఇస్నాపూర్ లో బతుకమ్మ సంబరాలు

18-10-2026 | 10:06pm

పటాన్ చెరు, అక్టోబర్ 18 : పటాన్‌చెరు నియోజకవర్గంలో(Patancheru Constituency) అత్యంత వైభవంగా కొనసాగినా ఇస్నాపూర్ లో జరిగిన బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) రాజకీయ, సాంస్కృతిక రంగాల ప్రముఖుల భాగస్వామ్యంతో ఒక చారిత్రాత్మక పండగను(Historic festival) తలపించాయి. స్థానిక బీఆర్ఎస్ కౌన్సిలర్లు రాహుల్ రెడ్డి(BRS Councilor Rahul Reddy), సుల్తాన్ పురం ఈశ్వరమ్మ, మచ్చ కిషోర్ రెడ్డి, మంజులా జనార్దన్ రెడ్డిల ప్రత్యేక ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత ప్రతిష్టాత్మకంగా, అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. ఊరూవాడా ఏకమై ఈ సంబురాలకు ప్రజలు, ముఖ్యంగా మహిళలు భారీ సంఖ్యలో కదిలివచ్చారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్, తాజా మాజీ సర్పంచులు పలు వార్డు సభ్యులు,  పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ మన జీవన విధానంలో అంతర్భాగమని కొనియాడారు. ఆడబిడ్డలంతా ఏకమై, ప్రకృతిని పూజించే ఈ పండుగను ఇంతటి ఘనంగా జరుపుకోవడం మన సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతోందన్నారు.

బీఆర్ఎస్ కౌన్సిలర్ల ప్రత్యేక పర్యవేక్షణలో వేడుకలను అత్యంత అద్భుతంగా, నిర్వహించడం పట్ల నిర్వాహకులను హృదయపూర్వకంగా అభినందించారుఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలను మన బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించుకోవడం విశేషమని, అలాగే మన ఆడబిడ్డలంతా ఏకమై, రంగురంగుల పూలతో ప్రకృతిని పూజించే ఈ పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని అని అయన పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచు లు స్థానిక బీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్లు, వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు వేలాది మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని వేడుకను దిగ్విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు