అమెరికాలో బతుకమ్మ సంబురాలు

18-10-2026 | 10:03pm

మంచిర్యాల, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : తెలంగాణ మహిళల(Telangana women) పూల పండుగ విదేశాలలో సైతం తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం ఫ్రెడరిక్ సమీపంలోని బ్రన్స్ విక్(Brunswick) లో బతుకమ్మ సంబురాలు(Bathukamma Celebrations) ఆది వారం ఘనంగా జరుపుకున్నారు. మన బ్రన్స్ విక్ బతుకమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలలో తెలంగాణ రాష్ట్రానికి(Telangana State) చెందిన వారితో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు సైతం అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలకు ఆడారు.

తెలంగాణ రాష్ట్ర మహిళల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఒక్కచోటకు చేరుకొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ ఆడి తమ వెంట తీసుకువచ్చిన సద్దులను ఒకరికొకరు పంచుకున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసుకున్న చిన్న కొలనులో బతుకమ్మలను సాంప్రదాయ బద్దంగా నిమజ్జనం చేశారు. అమెరికాలో తెలుగు వారు నిర్వహించిన బతుకమ్మ వేడుకల ఫొటోలు తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన వారి కుటుంబ సభ్యులతో పంచుకొని ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు