నిర్మల్ లో శివాజీ విగ్రహం ఆవిష్కరణ

18-10-2026 | 10:17pm

నిర్మల్ అక్టోబర్18(విజయక్రాంతి) : నిర్మల్ పట్టణంలోని నాయిడివాడలో ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj) విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం ఒక మహా యోధుడు మాత్రమే కాదు. ధైర్యసాహసాలకు, దేశభక్తికి, ధర్మరక్షణకు, స్వరాజ్య స్థాపనకు ప్రతీక. ఆయన చూపిన పోరాట స్ఫూర్తి, పరిపాలనా దక్షత, ప్రజల పట్ల బాధ్యత నేటి యువతకు ఆదర్శం. అని పేర్కొన్నారు.. 

ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఈ విగ్రహం మన యువతలో దేశభక్తిని, ఆత్మగౌరవాన్ని పెంపొందించే ప్రేరణ కేంద్రంగా నిలవాలి. అని చెప్పారు.. విశ్వహిందూ పరిషత్ అఖిల భారత సహ కార్యదర్శి, గోరక్ష విభాగం అఖిల భారత సహ ప్రముఖ్ ఆకారపు కేశవరాజు గారు , కౌన్సిలర్ సాదం అరవింద్, శ్రీరామోజి నరేష్, నాయిడివాడ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు