టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు

18-10-2026 | 10:14pm

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : తెలంగాణ పూల పండుగ సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) ముగింపు వేడుకలు టీఎన్జీవో హౌసింగ్ బోర్డ్ కాలనీ(TNGO Housing Board Colony)లో మహిళలు, ఆడబిడ్డలు ఆది వారం ఎంతో ఉత్సాహంగా భక్తిశ్రద్ధలతో(devotional) ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కాలనీ ప్రధాన వీధుల గుండా బతుకమ్మలు ఎత్తుకొని బ్యాండ్ మేళంతో స్వాగత నృత్త్యాలు చేస్తూ బతుకమ్మల వేదిక వద్దకు చేరుకున్నారు.

అనంతర మహిళలు ఎంత ప్రేమగా వివిధ వర్ణాల పూలతో ఏర్పరిచిన బతుకమ్మల చుట్టూ వలయకారంగా తిరుగుతూ ఆటపాటలతో చప్పట్లతో అర్ధరాత్రి వరకు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు పరస్పరం శుభాకాంక్షలు తెలియ జేసుకుంటూ ఆనందంగా గడిపారు.

ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కార్య నిర్వాహక అధ్యక్షుడు గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ బతుకమ్మ తల్లి ఆశీస్సులతో కుటుంబాలన్నీ సుఖసంతోషాలతో ఉండాలని, అన్ని శుభాలు జరగాలని, ఇదే ఐకమత్యంతో మునుముందు జరిగే ఉత్సవాలను ఆనందంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, అధ్యక్షులు శ్రీపతి బాబురావు, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, మహిళా బాధ్యులు పల్లవి, సునీత, అరుణ, స్వప్న, స్వర్ణ, కమల, నీరజ, పద్మాంజలి, విజయ, పుష్పలత, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు