విజయలక్ష్మి నగర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

18-10-2026 | 10:23pm

వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ చాందావత్ రమేష్ బాబు

ఇల్లెందు టౌన్, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను(Bathukamma celebrations) విజయలక్ష్మి నగర్‌లో మహిళలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు సంప్రదాయ దుస్తుల్లో సందడి చేస్తూ బతుకమ్మ పాటలు పాడారు. ఆటపాటలతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో సర్పంచ్ చాందావత్ రమేష్ బాబు పాల్గొని మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ఐకమత్యంతో జరుపుకోవడం సంతోషకరమన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.

మరిన్ని వార్తలు