ఉర్సుగుట్టలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కొండా సురేఖ
వరంగల్ అక్టోబర్ 18(విజయ క్రాంతి): వరంగల్ నగరంలోని(Warangal City) ఉర్సు గుట్ట రంగలీలా మైదానంలో(Ursu Gutta Rangaleela Ground) నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో(Saddula Bathukamma Celebration) మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ(Konda Surekha) పాల్గొన్నారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు మైదానానికి చేరుకుని పండుగ సందడిని నెలకొల్పారు. తెలంగాణ ఆడపడుచులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ సంబరాలు జరుపుకున్నారు.