శ్రీ నగర్ కాలనీలో బతుకమ్మ సంబరాల సందడి
ఆటపాటలతో అలరించిన మహిళలు.. నేడు సద్దుల బతుకమ్మ
రాజన్న సిరిసిల్ల 18అక్టోబర్ (విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణంలోని(Sircilla town) శ్రీనగర్ కాలనీలో బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) అంగరంగ వైభవంగా జరిగాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు సంప్రదాయ దుస్తుల్లో కొలువుదీరి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలు(Bathukamma Songs) పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ శోభను తీసుకొచ్చారు.
పూలతో పేర్చిన బతుకమ్మలు, మహిళల కోలాటాలు, జానపద గీతాలతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. సాంప్రదాయ ఆచారాలను పాటిస్తూ మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మను పూజించారు. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా నేడు సద్దుల బతుకమ్మ నిర్వహించనుండటంతో మహిళల్లో మరింత ఉత్సాహం నెలకొంది. చివరి రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మహిళలు సిద్దమైనారు.
ఈ కార్యక్రమం లో శ్రీనగర్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు.