జ్వరంతో వ్యక్తి మృతి
09-10-2026 | 04:30pm
టేకులపల్లిలో విషాదం.. చికిత్స పొందుతూ మృతి
టేకులపల్లి, అక్టోబర్ 9 (విజయక్రాంతి): టేకులపల్లి మండలంలోని(Tekulapalli Mandal) ముత్యాలంపాడు ఎక్స్‌రోడ్‌కు చెందిన బానోత్ రమేష్(Banoth Ramesh) (38) జ్వరంతో(fever) బాధపడుతూ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న రమేష్‌ను తొలుత కొత్తగూడెం ఆసుపత్రికి(Kothagudem Hospital) తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. రమేష్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.