అయ్యప్ప మాలధారులకు అన్నదానం
కోదాడ (అనంతగిరి), నవంబర్ 25 (విజయ క్రాంతి): అనంతగిరిలోని అయ్యప్ప సన్నిధిలో ప్రారంభమైన అన్నప్రసాద వితరణ (Annadanam) నిరంతరాయంగా కొనసాగుతోంది. బుధవారం 50వ రోజు (50th Day) సందర్భంగా సుమారు 430 మందికి పైగా అయ్యప్ప స్వాములు అన్నప్రసాదం (Prasadam) స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి మహారాజ పోషకులతో పాటు కోదాడకు చెందిన వేనేపల్లి రవి–అనూష, కోళ్ళూరి వీరయ్య–పద్మ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి దాతలుగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి వాసు గురుస్వామి, సభ్యులు పందిరి వీరయ్య, అయితనబోయిన వెంకటేశ్వర్లు, కోళ్ళూరి వేణుగోపాల్, నల్లచెర్ల రామకృష్ణ, బండారుపల్లి వెంకటేశ్వరరావు, సట్టు యాదగిరి, ఈదుల సత్యం, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.