బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

10-10-2026 | 10:23pm

టేకులపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకాంక్షించారు. టేకులపల్లి మండలంలోని ఉమ్మడి పంచాయతీ పరిధిలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయం సంత సెంటర్‌తోపాటు బస్టాండ్ సెంటర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు