అభివృద్ది పథంలో నూతన్ కల్ ప్రజలకు మెరుగైన వసతులే లక్ష్యం

16-09-2026 | 09:06pm

ఎల్లంపేట్ మున్సిపల్ చైర్ పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ నాయక్

మేడ్చల్ అర్బన్ సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్(Yellampet Municipality) పట్టణ పరిధిలోని నూతన్ కల్ పట్టణ ప్రజలకు మెరుగైన వసతులే లక్ష్యంగా ముందుకు సాగుతామని మున్సిపల్ చైర్ పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ నాయక్(Municipal Chairperson Lavudiya Sridevi Ramesh Naik) పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ నూతన్ కల్ మున్సిపల్ పట్టణంలోని సద్ది సురేష్ రెడ్డి, చిన్నోళ్ల భాస్కర్ వార్డులు 16వ వార్డులో 10 లక్షల రూపాయలతో అంతర్గత మురికి కాలువ నిర్మాణం, 21వ వార్డులో సీసీ రోడ్ల పనులకు కొబ్బరి కాయలు కొట్టి పనులను ప్రారంభించడం జరిగిందని ఆమే చెప్పారు.

మున్సిపల్ పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్ కృష్ణా రెడ్డి ల సహాకారంతో అంచలంచెలుగా నూతన్ కల్ మున్సిపల్ పట్టణంలో వార్డులను అభివృద్ధి చేస్తామని కౌన్సిలర్ లు సద్ది సురేష్ రెడ్డి,చిన్నోళ్ల భాస్కర్ లు తెలియజేశారు. నూతన్ కల్ మున్సిపల్ పట్టణంలోని 16వ వార్డు,21వ వార్డులలో 20 లక్షల రూపాయలతో అంతర్గత మురికి కాలువ,సీసీ రోడ్ల నిర్మాణం పనులను ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించడం జరిగిందని వారు చెప్పారు. అనంతరం నూతన్ కల్ వార్డు కార్యాలయంలో పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించడం జరిగింది.


మరిన్ని వార్తలు