ఏబీవీపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ

16-09-2026 | 09:26pm

హుజురాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(Telangana Liberation Day) పురస్కరించుకొని ఏబీవీపీ(ABVP) హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పూసాల విష్ణు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు, యోధులు పోరాడారని తెలిపారు. 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనమైందని పేర్కొన్నారు.

ఏబీవీపీ రాష్ట్ర నాయకులు గోస్కుల అజయ్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన పోరాట చరిత్రను నేటి తరం విద్యార్థులు తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి సాయి చరణ్, సంయుక్త కార్యదర్శులు కుమారస్వామి, శివ, అజయ్, భార్గవ్, ఉపాధ్యక్షులు చరణ్ తేజ, రాకేష్, కృష్ణ, మనిప్రీతం, విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు