పేదవారికి సేవ చేయడంలో వారాహి హెల్పింగ్ హ్యాండ్స్ ముందుండాలి
జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు మొరిశెట్టి లక్షాధి
సూర్యాపేట సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): పేదవారికి సేవ చేయడంలో వారాహి హెల్పింగ్ హ్యాండ్స్ ముందుండాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు మొరిశెట్టి లక్షాధి(District Arya Vysya Association leader Morisetti Lakshadhi), డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో బుధవారం వారాహి హెల్పింగ్ హ్యాండ్స్ నూతన కార్యాలయమును వారు ప్రారంభించి మాట్లాడారు.
ఎంతోమంది పేద విద్యార్థులు విద్యా, వైద్యం, అగ్రికల్చర్ వంటి ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇబ్బందులు పడుతుంటారని అలాంటి పేదవారికి అండగా ఉండడానికి వారాహి హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా సేవా కార్యక్రమాలను అలవర్చుకోవాలని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం కూడా చేయని పనులు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయని కొనియాడారు.
వారాహి హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు మహంకాళి రవీందర్ రావు మాట్లాడుతూ ప్రప్రధమంగా పేద ప్రజలకు సేవలు అందించుటకు సూర్యాపేటలో ఏర్పాటు చేశామని రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా వారాహి హెల్పింగ్ హాండ్స్ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉప్పల చంద్రశేఖర్, వారాహి గౌరవ సలహాదారులు రాచకొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చల్లా సత్యనారాయణ, కార్యదర్శి ఖమ్మంపాటి రేణు బాబు, కోశాధికారి బచ్చు పురుషోత్తం జాయింట్ సెక్రెటరీ లక్ష్మణ్, ఈసీ సభ్యులు మొలుగూరి శోభారాణి, పల్లెల ప్రసాద్ రావు, సుంకిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సుధారాణి, అమరేందర్ రెడ్డి, బొడ్డుపల్లి సతీష్, గజ్జి నవీన్,ఉయ్యాల నర్సయ్య, మామిడి శంకర్, తదితరులు పాల్గొన్నారు.