భద్రాచలం పవర్‌లిఫ్టర్‌కు శంషాబాద్‌లో స్వాగతం

25-10-2026 | 05:45pm

భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్  జివి రామిరెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం

భద్రాచలం, అక్టోబర్ 25, (విజయక్రాంతి) : అమెరికాలో(America) జరిగిన ప్రపంచ పవర్లిఫ్టింగ్ పోటీల్లో(World Powerlifting Championship) రెండు పతకాలు సాధించి భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను అంతర్జాతీయ స్థాయిలో(International level) చాటిచెప్పిన భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ సెంటర్‌కు(Bhadrachalam City Style Gym Center) చెందిన ప్రముఖ పవర్లిఫ్టింగ్ క్రీడాకారుడు డి.వి. శంకర్రావు ఆదివారం స్వదేశానికి తిరిగి రావడంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Shamshabad International Airport) ఘన స్వాగతం లభించింది.

74 ఏళ్ల వయస్సులోనూ అసాధారణ క్రీడా ప్రతిభను ప్రదర్శించి అమెరికాలో జరిగిన ప్రపంచ క్లాసిక్ పవర్లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పతకాన్ని, అలాగే ప్రపంచ ఎక్విప్డ్ పవర్లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకాన్ని సాధించి శంకర్రావు  చరిత్ర సృష్టించారు. వయస్సు, ఆరోగ్యపరమైన సవాళ్లను అధిగమిస్తూ కఠోర సాధనతో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం ఆయన పట్టుదలకు, క్రీడల పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది.

అమెరికా నుంచి తిరిగి వచ్చిన శంకర్రావు ని ఆయన కోచ్ జి.వి. రామిరెడ్డి , సన్నిహిత బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి శంషాబాద్ విమానాశ్రయంలో ఆత్మీయంగా స్వాగతించారు. విమానాశ్రయానికి చేరుకున్న శంకర్రావుకి పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.

ప్రపంచ స్థాయి పోటీల్లో సాధించిన కాంస్య, రజత పతకాలను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. పతకాలతో స్వదేశానికి తిరిగి వచ్చిన తమ అభిమాన క్రీడాకారుడిని అభినందిస్తూ, ఆయన విజయాన్ని తమ విజయంగా భావించి హర్షధ్వానాలతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా శంకర్రావు సాధించిన విజయాలను గుర్తు  చేసుకుంటూ కేక్ కట్ చేసి చేసి సంబరాలు జరుపుకున్నారు. పూలమాలలు శాలువాతో సత్కరించడం, కేక్ కటింగ్ తో ఆనందాన్ని పంచుకోవడం, వంటి కార్యక్రమాలతో శంషాబాద్ విమానాశ్రయం పండగ వాతావరణంతో నెలకొంది.

మరిన్ని వార్తలు