పద్మశాలి ప్రతిభా పురస్కారాలతో విద్యార్థులకు సన్మానం
గణపురం, అక్టోబర్ 25 (విజయక్రాంతి): పదవ తరగతిలో(Tenth Grade) అత్యధిక మార్కులు సాధించిన పద్మశాలి కుటుంబాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు(Students) పోపా ఆధ్వర్యంలో ఆదివారం పద్మశాలి ప్రతిభా పురస్కారాలను(Padma Shali Pratibha Awards) అందజేసి ఘనంగా సన్మానించారు. ఉమ్మడి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పోపా రాష్ట్ర అధ్యక్షులు శామంతుల శ్రీనివాస్(POPA State President Shamanthula Srinivas), రాష్ట్ర నాయకులు కమర్థపు మురళి, గుండు సుధారాణి, రాపోలు ఆనంద భాస్కర్, గూడూరి శ్రీనివాస్, కూరపాటి వెంకటనారాయణ, కందగట్ల స్వామి తదితరుల చేతుల మీదుగా విద్యార్థులకు పుష్పగుచ్ఛం, శాలువా, షీల్డ్, ప్రశంసాపత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
మార్చి 2026లో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన చెల్పూర్ గ్రామానికి చెందిన మోత్కూరి రామ్చరణ్ తేజ 557 మార్కులు, వావిలాల అభిలాష్ 554 మార్కులు, రెబ్బ నిత్యశ్రీ 552 మార్కులు, కోమాకుల రాజశ్రీ 500 మార్కులు సాధించి పురస్కారాలకు ఎంపికయ్యారు.
ఈ కార్యక్రమంలో శ్రీ మార్కండేయ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు బూర్ల ప్రవీణ్, మాజీ అధ్యక్షుడు దుంప నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు చెలిమల్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.